చవి

  

డిసెంబర్ 24, 2025

చవి (chavi)

   అర్థము

    (విశేష్యము) : రుచి; ప్రేమ; ఆశ 

  Meaning

   (noun) : taste; love; 

    వాడుక / Usage

    మనసు చూడవలసి మాయలు నీవే కప్పి, జనులకు విషయాలు చవులుచూపి; కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి, ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా.
    You ensconce Self behind a veneer of illusions, ensnare us in sweet sensory pleasures; if we look past these you liberate us, else saddle us with the fruits of action; and then you stand tall - but who dear Lord is the doer?  

  మెదడుకు మేత / Food for thought

    మనసు మనసుతో ముడివేసి

    మౌన ప్రేమతో పెనవేసి
    ఒకరినొకరిగా తోడును చేస్తావూ
    ఒకరి నీడలో ఒకరిని చూస్తావూ
    వలపు దీపాలు వెలిగించి
    వేల వెన్నెలలు కురిపించీ
    కలల కాలాన్ని కరిగించేస్తావూ
    శిలకు ప్రాణాలు నువ్వే పోస్తావూ
    ఆడినంతసేపాడుకునీ బొమ్మలన్ని విసిరేస్తావు
    ఊహ తెలియనీ పసిపాపై బొమ్మరిల్లు తన్నేస్తావు
    ఏమాయ తెలియనీ పసి హృదయాలను తలో దిక్కుగా విసిరికొడతావు
    గుండెనెందుకిచ్చావురా దేవుడా

    -- సంపంగి, వరికుప్పల యాదగిరి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి