ఏలు

 

డిసెంబర్ 26, 2025

ఏలు (ēlu)

   అర్థము

    (క్రియ) : పాలించు; రక్షించు; శాసించు

  Meaning

   (verb) : rule; govern; protect

    వాడుక / Usage

    యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె, నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా.
    Sri Venkateshwara, you are our master and protector in all of these; weigh deeds of mine and yours and it will become apparent.  

  మెదడుకు మేత / Food for thought

    మగువ మనసు మంచు కడిగిన మంచి ముత్యము వంటిది

    చెలిమి పంచి మసలుకుంటే ఆమె దేవత వంటిది     అందమైన ఆ నడకలు అగరు ధూపపు లతికలు     మమతలొలికే ఆ పలుకులు కస్తూరీ శ్రీ గంధం     చల్లనైన చూపు లాలన పునుగు జవ్వాజి     పెదవి దాటని మిసిమి నవ్వులే అత్తరు పన్నీరు     ముచ్చటైన మురిపెమ్ముల అష్ట గంధపు భరిణ అతివ     మెట్టినింట తిరుగు వేళల ఆమె గృహ రాజ్యలక్ష్మి     అన్నా వస్త్రములమరించే అలయనీ సౌభాగ్య లక్ష్మీ     దీపకాంతుల అప్సరసల పతికి ఆమె మోక్ష లక్ష్మీ     చంటిపాపల పిన్న పెద్దల సాకే సంతానలక్ష్మీ     మగని వెంట జంట నిలిచే అష్టలక్ష్మీ రూపము

    -- లలితగీతం, సూరిభొట్ల లక్ష్మి గారు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి