చిత్తు
జనవరి 21, 2025
చిత్తు (chittu)
అర్థము
(విశేష్యము) : జ్ఞానము; మొదటి వ్రాసి పక్కకు పెట్టేసిన వ్రాత/లెక్క; ఓడిపోవడం
Meaning
(noun) : Knowledge; Consciousness; rough copy; defeated
వాడుక / Usage
శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే శ్రీవారే చిత్తై పోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే.
Sonata sashays to my song fluttering your mantle; shackles desire a dalliance that spends the lover.
మెదడుకు మేత / Food for thought
అజ్ఞానపు టంధయుగంలో
ఆకలిలో, ఆవేశంలో-
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడిచి మనుష్యులు
అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్యాజ్యాలూ,
నిర్మించిన కృత్రిమచట్టాల్
ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను
-- మహాప్రస్థానం/దేశ చరిత్రలు, శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983)
Comments
Post a Comment