వెరగు
ఫిబ్రవరి 02, 2025
వెరగు (veragu)
అర్థము
Meaning
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
పోల్చనా నిన్ను వైశాఖపు వేసవి రోజుతో?
దానికంటే మధురం దానికంటే మృదు మరువం నువ్వు:
మరులుగొల్పే మల్లెలు వాడి వేసారు వడ గాలి సెగలతో,
వసంత కాలపు రోజులు వడివడిగా సాగి కనుమరుగవ్వు:
గగనవీధిలో వెలిగే నేత్రం వేసవిలో మంటలురేపే మధ్యాహ్నం,
సువర్ణరేఖల భానుడు మబ్బుల మాటున చేరి దోబూచులాడెను అపుడపుడూ;
సృష్టిలో ప్రతీ అందం కాలానికి ఒగ్గును శిరం, తప్పదు దాని పతనం,
ప్రకృతి ధర్మం అది, చెరగని నిజం అది, తరతరాల ఈ శృంఖల ఆగదు ఎపుడూ:
కానీ నీ నిరంతర వసంతోత్సవం వాడదు ఎన్నటికి,
భువినుండి పునికి పుచ్చుకున్న నీ సౌందర్యం ఇక చేజారదు:
డాంబికాలు పలుక తరమా, నల్లని తన నీడ నిను తాకుతుందని, మృత్యువుకి
అజరామరమైన ఈ పంక్తులలో నీ లావణ్యం కలకాలం ఎదుగుతుండగా:
మనిషి ఊపిరి తీసుకునేంతవరకు, కనులు చూసేంతవరకు,
ఈ పదాలు బ్రతికున్నంతవరకు, నీకు ప్రాణం పోస్తూ ఉన్నంతవరకు.
-- సొన్నెట్ 18, విలియం షేక్‌స్పియర్ (https://manatelugumaata.blogspot.com/2026/02/blog-post.html)
Comments
Post a Comment