ఫిబ్రవరి 13, 2025
ముంగిట (mungiṭa)
అర్థము
(క్రియావిశేషణము) : ముందర; ఎదురుగా
Meaning
(adverb) : at first; in front
వాడుక / Usage
ముంగిట పొలసిన మోహన మాత్మల పొంగించే ఘన పురుషుడు.
He is the One who bestows upon the devoted that come to his threshold.
మెదడుకు మేత / Food for thought
తన ఇంటి ముంగిట భూదేవి నుదుట
ముగ్గులేసిందమ్మ కలికీ సిగ్గులన్నీ చిలికి చిలికి
నేలపై తారాడు నింగి చుక్కల్లో
ఉరుములేక ధరను మెరయు మెరుపుల్లో
ముద్దమందారాల పొత్తు కడుపుల్లో
చిన్ని వన్నెల ముగ్గు ఇలకు హరివిల్లు
పల్లె నిండా పాల కడలి కెరటాలు
ఇళ్ల నిండా వెలుగు సూర్య కిరణాలు
శ్రీరామచంద్రుని శ్రీ పాదములకు
సీతమ్మ అర్పించు నీరాజనాలు
-- జేగంటలు (1981), వేటూరి
Comments
Post a Comment