అగ్రతాంబూలం

 

ఫిబ్రవరి 16, 2025

అగ్రతాంబూలం (agratambulam)

   అర్థము

    (విశేష్యము) : గౌరవసూచకంగా అందరికంటే ముందు ఇచ్చే తాంబూలం; ప్రాధాన్యం

  Meaning

   (noun) : first to be honoured in a gathering; primacy

    వాడుక / Usage

    మంత్రివర్గంలో కొత్తవారికి అగ్రతాంబూలం.
    First time ministers given priority. 

  మెదడుకు మేత / Food for thought

    అజ్ఞానం క్రియకీ కర్మకీ కారణం. జ్ఞానం సమాధికీ విధానానికి కారణం. ఆ అజ్ఞానాన్ని తను భద్రంగా కాపాడుతాడు. ఆ అజ్ఞానాన్ని తను భ్రమలతో, ఆశలతో పోషిస్తాడు. తన మనస్సు తన భావాన్ని నిజానికి నమ్మలేదు. తనలో వుండే అధికార వాంఛ నిజానికి ఆ భావాన్ని తయారు చేసి ఇతరుల్ని నమ్మమంది. తానే నమ్మినట్టుగా నమ్మించింది. తాను నమ్మినట్టుగా వుండిపోవడం వలన ఒక్కొక్కసారి తాను నమ్మేశాడు. అలా నమ్మకపోతే పదికోట్ల జండాలమీద పదికోట్ల అర్థచంద్రరేఖ లెగరవు. పదికోట్లమంది యొక్క ఇరవైకోట్ల కళ్ళల్లోని భక్తినీ, విశ్వాసాన్నీ తాను చూరగొనలేడు. తనకే కాదు, స్వార్థం అందరికీ వుంటుంది. హిట్లర్, చర్చిల్, నెహ్రూ, గాంధీ – అందరికీ వుంటుందనుకున్నాడు జిన్నా.

    -- అద్దంలో జిన్నా (1961), దేవరకొండ బాలగంగాధర్ తిలక్ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి