అరణ్యరోదన
ఫిబ్రవరి 17, 2025
అరణ్యరోదన (aranyarodana)
అర్థము
(విశేష్యము) : అడవిలో ఏడుపు; ఉపయోగం లేనిది
Meaning
(noun) : a cry in the wilderness; having no use/effect
వాడుక / Usage
ఆర్టీసీ కార్మికులు అరణ్యరోదన.
RTC workers plea for help has no takers.
మెదడుకు మేత / Food for thought
లేచిపోయినా నంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంగా ఉంటుంది. ఇదివరకంతా ఈ మనుషుల్లోంచి, నీతివర్తనులలోంచి వెళ్ళిపోయి ఎడారిలో జీవించటం వల్ల నేను చేసిన పని ఘోరత్వం నీచత్వం బోధపడలేదు. ఆ జీవితమంతా సుందరమైన దివ్యమైన స్వప్నమువలె, ఆ ఏడారి పుణ్యభూమివలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళహారతివలె తోచింది. ఇంటిని, బంధువుల్ని, భర్తని మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్‌ని, మీరాని అనుభవించిన తరవాత మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులైనా, మనుషులేనా అనిపిస్తుంది నాకు.
-- మైదానం (1927), చలం
Comments
Post a Comment