ఉత్సవవిగ్రహం
ఫిబ్రవరి 18, 2025
ఉత్సవవిగ్రహం (utsavavigraham)
అర్థము
(విశేష్యము) : ఊరేగింపుకు వాడే విగ్రహం; సత్తా/అధికారం లేని వారు
Meaning
(noun) : small idol used in procession; figurehead; having no power
వాడుక / Usage
మన వ్యవస్థలో గవర్నర్ కేవలం ఉత్సవవిగ్రహం మాత్రమే...కానీ . .
Governor is just a figure head in our system..But...
మెదడుకు మేత / Food for thought
మనిషికీ మనిషికీ మధ్యలోనే కాదు గోడలుండడం. ప్రతి మనిషిలోనూ ఒక పల్చటి తెర ఉంటుంది. ఆ తెర ఊడిపోకుండా సంఘం కాపలా కాస్తుంటుంది. కాని రాత్రి ఎప్పుడో – మండు వేసంగి రాత్రి మైమరిచి నిద్ర పోతుంటేనో, వాన చినుకులు పడి భూమి పొంగినప్పుడో – ఎప్పుడో ఎందుకో తెర విడిపోతుంది నిజస్వరూపం భయంకరంగా కనబడుతుంది. విసుక్కుంటుంది, తిడుతుంది; కొడుతుంది కూడా.
-- తనను గురించిన నిజం (1927), బుచ్చి బాబు
Comments
Post a Comment