పక్కలో బల్లెం

 

ఫిబ్రవరి 20, 2025

పక్కలో బల్లెం (pakkalo ballem)

   అర్థము

    (విశేష్యము) : సమీపంలో ఉన్న శత్రువు లేదా ఎప్పుడూ ప్రమాదం కలిగించే వాడు

  Meaning

   (noun) : thorn in the side; trouble maker

    వాడుక / Usage

    పాక్‌ పక్కలో బల్లెం బలూచిస్తాన్‌.
    Balochistan - thorn in the side of Pak. 

  మెదడుకు మేత / Food for thought

    మానవజాతుల శోకార్ధ సంగీతం! నిన్ను వెంబడిస్తున్న శిథిలాలు. క్షణాన్ని లోకం నుంచి వేరుచేసి విడిగా తీసుకోవటం ఎలాగ? సౌందర్య సమక్షంలో విచారానికి తావివ్వక పోవటం ఎలాగా? నీ కవతల, నీ ప్రక్కన, నీలోనగాక నన్నే చూడటం ఎలాగ? జ్ఞాపకాల తలుపులు మూసి, మృత వాయువుల మట్టి వాసనలు రాకుండా చేసి నీ పరిమళాన్ని అందుకోవటం నాకు చేతనౌతుందా? అనుమానం, సందేహం, భయం. విశ్వాసం లేదు ఈ కాలపువాళ్ళకి. బయట నక్షత్రకాంతిలో, నిశాసౌరభశ్వాసలు చెంపల్ని తాకుతుండగా అతడొక నిట్టూర్పు విడిచాడు. దుమ్ము నిండిన గదిలో సిగరెట్ పీకలు. To sleep, prepare for life. Each morning new horror brings. అయితేనేం? మిగిలిన రోజులన్నీ ఎడారులైతేనేం? రేపుదయమే, ఈ క్షణమే నేను చస్తేనేం? నేనొక గంట జీవించాను. చాలా వాస్తవంగా జీవించాను.

   -- ఒక గంట జీవితం (1950), బైరాగి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి