శివాలెత్తు

 

ఫిబ్రవరి 24, 2025

శివాలెత్తు (sivalettu)

   అర్థము

    (క్రియ) : చిందులు తొక్కే ఆవేశం; కోపంతో ఆగిపోవడం

  Meaning

   (verb) : violent rage/anger; rampage

    వాడుక / Usage

    శివాలెత్తిన మార్క్రమ్‌.. విధ్వంసకర శతకం.
    Rampaging Markam scores a destructive century. 

  మెదడుకు మేత / Food for thought

    కలగంటిని, నేను కలగంటిని
    కలలోన తల్లిని కనుగొంటిని

    మెడలోన అందాల మందారమాల,
    జడలోన మల్లికాకుసుమాల హేల!
    ఆ మోములో వెల్గు కోటి దీపాలు,
    ఆ తల్లి పాదాలు దివ్యకుసుమాలు!

    కంచి కామాక్షియా? కాకున్న, ఈమె
    కాశీ విశాలాక్షి కాకూడదేమి?
    కరుణించి చూసెనా, వెన్నెలలు కురియు!
    కన్నెర్ర జేసెనా, మిన్నులే విరుగు!

    పోల్చుకున్నానులే, పోల్చుకున్నాను!
    వాల్చి మస్తకము, నే ప్రణమిల్లినాను!
    అనుపమానాలోక్య భాగ్యస్తమోపేత
    ఆమె ఎవరో కాదు, భారతమాత!

   -- మధురాంతకం రాజారామ్ (రచన), రామడుగు లక్ష్మీనారాయణవరప్రసాద శాస్త్రి (స్వరం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ