శల్య పరీక్ష

 

ఫిబ్రవరి 25, 2025

శల్య పరీక్ష (salyapareeksha)

   అర్థము

    (విశేష్యము) : (శల్య=ఎముక), నిశితమైన పరీక్ష; తనిఖీ; సూక్ష్మ విశ్లేషణ

  Meaning

   (noun) : close scrutiny/observation

    వాడుక / Usage

    ప్రతి రాజకీయ నాయకుడికీ యువత శల్య పరీక్ష పెట్టాలి.
    Youth should scrutinise every politician very closely. 

  మెదడుకు మేత / Food for thought

    పంట చేల గట్ల మీద నడవాలి
    ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
    మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
    జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

    ఒయ్యారి నడకలతో ఆ ఏరు,
    ఆ ఏరు దాటితే మా ఊరు!
    ఊరి మధ్య కోవెల, కోనేరు
    ఒకసారి చూస్తిరా తిరిగి పోలేరు!
    ఊరి మధ్య కోవెల, కోనేరు
    ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు!

    పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి
    పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి
    ఏరు దాటి తోట తోపు తిరగాలి
    ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి

    మా ఊరు ఒక్కసారి పోయి రావాలి

    చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి
    మనసువిప్పి మాట్లాడే మనుషులు కలవాలి
    ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి
    ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి

    పంట చేల గట్ల మీద నడవాలి
    ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
    మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
    జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి

   -- పాలగుమ్మి విశ్వనాథం (రచన, స్వరం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి