షరా మామూలు
ఫిబ్రవరి 26, 2025
షరా మామూలు (sharaa maamoolu)
అర్థము
(జాతీయం) : గమనిక(షరా)లో కొత్తగా ఏమీ లేదు; ఎప్పుడూ జరిగేదే; అందరికీ తెలిసినదే
Meaning
(idiom) : usual thing; common happening
వాడుక / Usage
పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే...
Free sand only in name...usual conditions apply...
మెదడుకు మేత / Food for thought
గాలిలో నా బ్రతుకు
తేలిపోయినదోయినీలిలో కలసింది
మాలి! నా బ్రతుకోయి!
గాలిలో...
పంచభూతములార!
రాయంచ, గిరులార!
నా పంచ జేరరే!
పలుకరింపగ రారే!
గాలిలో...
రావోయి, రావోయి
నా దరికి రావోయి
ఆరిపోవునో ఏమో
నా చిన్ని వెలుగోయి
నా చిన్ని వెలుగోయి
గాలిలో...
కరుణ ఎరుణా లేని
కాలదేవతనుండి
కాపాడ రావోయి
గాలిలో నా బ్రతుకు
కరుణ ఎరుణా లేని
కాలదేవతనుండి
కాపాడ రావోయి
గాలిలో నా బ్రతుకు
నిలుపంగ రావోయి
గాలిలో నా బతుకు!
గాలిలో నా బ్రతుకు
తేలిపోయినదోయి
నీలిలో కలసింది
మాలి! నా బ్రతుకోయి!
-- రతన్ రావు (రచన), ఘంటసాల (స్వరం)
Comments
Post a Comment