వాపోవు

 

ఫిబ్రవరి 05, 2025

వాపోవు (vāpōvu)

   అర్థము

    (క్రియ) : ఆవేదన వ్యక్తం చేయడం; అరవటం; ఏడవడం

  Meaning

   (verb) : to cry out; wail

    వాడుక / Usage

    జీరో టికెట్స్ కండక్టర్ల ప్రాణం మీదకు వస్తున్నాయి అని ఆర్టీసీ జేఏసీ వాపోయింది.
    Zero priced tickets are making conductor's lives difficult laments JAC

  మెదడుకు మేత / Food for thought

    నిండుగా పూసిన ప్రతి మామిడి చెట్టూ
    నేను పోగొట్టుకున్న దాన్ని
    నేను నిజంగా పోగొట్టుకోలేదనే చెప్తుంది.

    మాఘమాసం రాగానే
    కిందటేడాది ఎక్కడ వదిలిపెట్టానో
    ఆ కవితలక్కడే కనిపిస్తాయి.

    మునుపెన్నడో ఒక కథలో చదివామే
    గంగానదిలో ఒక కంకణం పోగొట్టుకున్న చోటనే
    రెండో కంకణం కూడా దొరికినట్టు
    అప్పుడు సగంలో ఆగిపోయిన చరణానికి
    ఇప్పుడు రెండో చరణం తోడై దొరుకుతుంది.


    -- వాడ్రేవు చినవీరభద్రుడు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి