కబంధ హస్తాలు

 

ఫిబ్రవరి 19, 2025

కబంధ హస్తాలు (kabandha hasthalu)

   అర్థము

    (విశేష్యము) : విడిపించుకోడానికి వీలు లేని పట్టు; రామాయణంలో కబంధుడు అనే రాక్షసుడు నుంచి

  Meaning

   (noun) : clutches; death/iron grip; vise

    వాడుక / Usage

    దేశం అవినీతిపరుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది.
    The country is caught in the vise of corrupt people. 

  మెదడుకు మేత / Food for thought

    కొన్ని స్మృతులు దిగులు కలిగిస్తాయి. మనస్సులోకి వచ్చి, మునిమాపు చీకట్లో మందిరంలోనికి వచ్చే గబ్బిలాల్లాగ. మరికొన్ని ఉదయాన్నే ఇంటి కిటికీలోనుంచి లోనికి చొరబడి గిలిగింతలు పెట్టో, ఒళ్ళు నిమిరో, లేపే సూర్యకిరణంలాగ, గాలి కెరటంలాగ ఉంటాయి. కొన్ని అడపా తడపా పెళ్ళి పందిట్లో అత్తరు వాసనలాగ తగుల్తాయి. వేరొక కొన్ని క్రేవనే ఉన్న ఇల్లాలి కుంతలాలనుంచి తటాలున సాంబ్రాణి వాసనలాగ స్ఫురిస్తాయి. కొన్ని వేసంగి సందెలో మల్లె తావి లాగ పులుగు కూతలాగ హాయి అనిపిస్తాయి...త్వరగా ఊళ్ళోకి నడిచి వెళ్ళాను. అక్కడ నా చంద్రంపాలెం లేదు.మా ఊరు పోయింది!

   -- మా ఊరు పోయింది (1927), దేవులపల్లి కృష్ణ శాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ