గని

 

ఫిబ్రవరి 10, 2025

గని (gani)

   అర్థము

    (విశేష్యము) : బిలం; రంధ్రం; భూమిలో ధాతువులు/లోహములు త్రవ్వి తీసే బిలం 

  Meaning

   (noun) : mine; quarry; hole

    వాడుక / Usage

    నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు.
    He stands tall as the embodiment, the goldmine of divinity. 

  మెదడుకు మేత / Food for thought

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం

ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
వెలిసింది దేవాలయం..అదే ప్రేమాలయం
ఒక రాగం పిలిచిన చోట..అనురాగం పలికిన చోటా
వెలిసింది రాగాలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం

మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విరిసిన చోట
వెలిసింది హృదయాలయం..అదే ప్రేమాలయం
ఆకాశం వంగిన చోట..భూదేవిని తాకిన చోట
వెలిసింది ఒక ఆలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం

-- అద్దాల మేడ (1981), దాసరి

Comments