పూర్ణము

 

మార్చి 05, 2025

పూర్ణము (pūrṇamu)

   అర్థము

    (విశేషణము/విశేష్యము) : నిండినది; సమస్తము; సకలము; బూరె; భిన్నము కాని సంఖ్య

  Meaning

   (adj/noun) : full; complete; entire; whole number

    వాడుక / Usage

    ఆమె ఒక పూర్ణమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతోంది.
    She is living a fulsome and satisfying life.

  మెదడుకు మేత / Food for thought

    ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
    पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥

    ఓం పూర్ణమదః పూర్ణమిదం పుర్ణాత్పూర్ణముదచ్యతే |
    పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

    (అది పూర్ణం. ఇది పూర్ణం. పూర్ణం నుంచి పూర్ణం ఆవిర్భవిస్తుంది. పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేసినా మిగిలేది పూర్ణమే’! ఇది మంత్రార్థం. ఈ భావం ఎంత గాఢమైందో అంత తేలికైంది కూడా. 
ఇక్కడ చెప్పిన పూర్ణత్వం పరబ్రహ్మాన్ని ఉద్దేశించింది. అనంతానంతమైన పరబ్రహ్మం నుంచి ఈ చరాచర సృష్టి భావమాత్రంగా వచ్చింది. దాని నుంచి తిరిగి నిరంతరం భౌతిక సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ పరిశీలిస్తే పరబ్రహ్మ, సృష్టి రెండూ పరిపూర్ణాలే. ఒకసారి సృష్టి అయిన తరువాత పరబ్రహ్మం డొల్లగా మారదు. అది ఎప్పటికీ పూర్ణమే. అంటే బ్రహ్మం అనేది ఎంత తీసేసినా తరగని నిధే. అది ఎప్పటికీ సంపూర్ణమే)

    - ఈశావాస్య ఉపనిషత్తు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి