వర్గమూలము
మార్చి 06, 2025
వర్గమూలము (vargamoolamu)
అర్థము
(విశేష్యము) : ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణిస్తే వచ్చేది వర్గం; ఈ వర్గానికి మూలం మునుపటి సంఖ్య
Meaning
(noun) : square root
వాడుక / Usage
జ్యామితిలో చతుర్భుజాలకు సంబంధించిన లెక్కలు చేయడానికి వర్గమూలాలు కావాలి.
Problems related to quadrilaterals in Geometry need square roots.
మెదడుకు మేత / Food for thought
అలికుల దళమిశ్రం మాలతీం యాతుమష్టౌ
కుటజమభి గతాంశే భూరిణి భాగముక్త్వా |చలదళ విమలేఒంభో భ్రామ్యతే కాపి కాంతే
వద గణితవిదగ్ధే తన్మిళిందాభిధానమ్ ||"
(తుమ్మెదల మొత్తం సంఖ్యలో సగం యొక్క వర్గమూలం మాలతీ పూల వద్దకు వెళ్ళాయి. మొత్తం సంఖ్యలో ఎనిమిదింట తొమ్మిదవ వంతు కుటజ పూల వద్దకు వెళ్ళాయి. మిగిలిన ఒక్క తుమ్మెద ఒక తామర పువ్వు చుట్టూ తిరుగుతోంది. అయితే ఆ గుంపులో ఉన్న మొత్తం తుమ్మెదలు ఎన్ని?)
- లీలావతీగణితం, భాస్కరాచార్యుడు (~ 12వ శతాబ్దం)
Comments
Post a Comment