పైరగాలి

 

ఏప్రిల్ 01, 2025

పైరగాలి (pairagali)

   అర్థము

    (విశేష్యము) : వేసవికాలములో ఆగ్నేయ (దక్షిణ తూర్పు మధ్య)  దిశనుండి, సముద్రము నుండి భూమి మీదికి వీచు, చల్లగాలి

  Meaning

   (noun) : south easterly cooler winds in summer (good for crops)

    వాడుక / Usage

    ఇంతలో పైరగాలి పరిగెత్తుకొచ్చింది. పచ్చటి గాలి, కంకుల గాలి, కండెల గాలి, కాయల గాలి, పువ్వుల గాలి, పూతల గాలి నేల వాసన పూసుకుని ఊరంతా పరుచుకుంది.
    The south easterly winds blew quickly - air of the fields, of stalk, of corn, of vegetables, flowers and blossom - carrying the earthy smells it spread around the village.

  మెదడుకు మేత / Food for thought

     నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.

    -- వెన్నెల్లో ఆడపిల్ల, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ