బడలిక

 

ఏప్రిల్ 16, 2025

బడలిక (baḍalika)

   అర్థము

    (విశేష్యము) : అలసట; శ్రమ

  Meaning

   (noun) : fatigue; exhaustion

    వాడుక / Usage

    అహోరాత్రులు బడలిక లేక పయనించే బాటసారయ్యాడు సముద్రపు కెరటాలపై తేలుతో నీ జాడకై.
    He became the incessant tireless traveller, in your search, gliding on the waves of Samsara.

  మెదడుకు మేత / Food for thought

    నా గురించి నాకు ఏమీ తెలియకపోవడానికి, సిద్ధార్థుడు నాకు పరాయివాడిగా, అపరిచితుడిగా మిగిలిపోవడానికి కారణం ఒక్కటే, ఒకే ఒక్క విషయం - నాకు నేనే భయపడ్డాను, నా నుండే పారిపోయాను. నేను ఆత్మను, బ్రహ్మాన్ని వెతికాను; నన్ను నేను ముక్కలు చేసి, నా పైపొరలను చీల్చి, ఆ పొరల నడిబొడ్డున ఉన్న ఆత్మను, జీవాన్ని, దైవిక సూత్రాన్ని, పరమ సత్యాన్ని కనుగొనాలని నిశ్చయించుకున్నాను. కానీ అలా చేయడంలో, నన్ను నేను కోల్పోయాను.

    - సిద్ధార్థ (1922), హెర్మన్ హెస్ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ