తరుణము
ఏప్రిల్ 17, 2025
తరుణము (taruṇamu)
అర్థము
(విశేష్యము/విశేషణము) : సమయం; కొత్తది; యౌవనము కలది
Meaning
(noun/adj) : time; opportune moment; tender; young
వాడుక / Usage
చీకటి ఆలోచనలను చెల్లా చెదరు చేసాడు అనంత విశ్వాన్ని తెలుసుకున్న తరుణంలో.
The moment he realised the Oneness of the infinite Universe, darkness of his thoughts was destroyed.
మెదడుకు మేత / Food for thought
జ్ఞానాన్ని ఇతరులకు బోధించలేము. తాను తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తే అది మిగతావారికి ఎప్పుడూ అవివేకంగానే వినిపిస్తుంది... పాండిత్యం నేర్పించవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. జ్ఞానాన్ని పొందవచ్చు, దానితో జీవించవచ్చు, దాని ద్వారా అద్భుతాలు చేయవచ్చు, కానీ దానిని ఇతరులకు అందించలేము, బోధించలేము. అది ఎవరికివారు కనుగొనాలిసిందే. - సిద్ధార్థ (1922), హెర్మన్ హెస్
Comments
Post a Comment