ఆలింగనము

 

ఏప్రిల్ 20, 2025

ఆలింగనము (ālinganamu)

   అర్థము

    (విశేష్యము) : కౌగిలింత

  Meaning

   (noun) : an embrace

    వాడుక / Usage

    కోహ్లీపై మెక్‌గ్రాత్ ప్రశంసలు, పంత్‌కు ఓనర్ ఆత్మీయ ఆలింగనం!
    McGrath showers praises on Kohli, owner gives a hearty hug to Pant.

  మెదడుకు మేత / Food for thought

    ఏం చేశావా? సుందరమైన కీర్తనలో..ఏం తాళం ఏం రాగం అని అడుగుతున్నావు. అనుభవించడం చేతగాక! "ఇదివరకు ఏమైనావు, ఇక ఏమవుతావు?" ఎందుకవన్నీ?! వెన్నెట్లో కూచుని 'చంద్రుడు అస్తమిస్తాడే - నిన్న ఉదయించలేదే' అని ఏడ్చే నిర్భాగ్యుణ్ణి నిన్ను చుశానుగాని! స్త్రీ వొళ్ళో ఎన్నాళ్ళు కూచుంటుంది? చంద్రుడు ఎంతసేపు వెలుగుతాడు? వెలిగితే... నిద్రపోతావు. అట్లానే (నేను) నిలిస్తే ఈ సౌందర్యం భరించగలవా నాయనా? ఎంత వేదాంతం బోధించింది ఆ కొంచం మాటల్లో? జన్మంతా కృతజ్ఞుణ్ణి! 

    - అరుణ (1935), చలం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ