జీరాడు
ఏప్రిల్ 21, 2025
జీరాడు (jīrāḍu)
అర్థము
(క్రియ) : వ్రేలాడు; కొంగు లేక వస్త్రం యొక్క అంచు నేలపై పారడం
Meaning
(verb) : cloth hanging down or trailing on the ground
వాడుక / Usage
కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి...ఆ కొంగులోన దోరవయసు దాచిపెట్టి.. నిలు నిలు నిలవమంటే నా తరమా.
Frills of the saree trailing, nubile youthfulness furtively hidden; bear I cannot.
మెదడుకు మేత / Food for thought
ఈ కొత్త కాలంలో కొత్త ఊహల్లో కొత్త పిలుపుల్లో కొత్త వాతావరణంలో, ఆత్మని నలుదిక్కులకి కొత్త ఆశలు పెట్టి అశాంతిపరిచే కొత్త కాంతుల్లో, స్త్రీని పాత గూళ్ళలో, తుక్కుపురాణ నీతుల్లో, నవీన జీవితానికి ఏ సంబంధము లేక పుచ్చిన నీతి నిబంధనల్లో, కుళ్ళిన ముసలమ్మల శాసనాల్లో, దుర్భరమైన గృహాల్లో కళ్లుమూసి, బంధించి ఉంచాలని చూసే నేర్పుగల దూర్తలోకం. - అరుణ (1935), చలం
Comments
Post a Comment