తావళము
ఏప్రిల్ 24, 2025
తావళము (tāvaḷamu)
అర్థము
(విశేష్యము) : దండ; మాల; రుద్రాక్షలు గుచ్చిన గొలుసు
Meaning
(noun) : a necklace of beads; rosary; garland
వాడుక / Usage
రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే మూడు తావళాలు.
Three garlands - one each from the elbow, one from the waist hanging over the knees and touching the feet.
మెదడుకు మేత / Food for thought
ఈ సఫలమైన ఆనందం కన్న, ఆ తీరని వేదన ఎక్కువ వాంఛనీయమేమో! ఏ సుఖం కష్టాలనే అలల మీద యీ ప్రపంచం వూగుతోందో, ఆ సుఖదుఃఖ భేదం - నిజంగా ఆ భేదం వుందా? ఆనందం దొరకగానే, ఎన్నేళ్లో పడ్డ బాధంతా పడనట్టే తోస్తుంది. కాని ఆ ఆనందం యిట్లా వేళ్ళలోంచి జారి ... యింకేముంది బాధకాక అనిపిస్తుంది. ఆ రాత్రి - ఆ పూర్వపు రాత్రి - ఆమె తెల్లారి వెళ్ళిపోతుందే, తక్కిన రాత్రినంతా కూడా మాధుర్యంతో నింపగల శక్తి యీ నరాలకి లేకపోయిందే అని దుఃఖించడంతో గడించింది. - అరుణ (1935), చలం
Comments
Post a Comment