పుచ్ఛము

 

ఏప్రిల్ 27, 2025

పుచ్ఛము (puchchhamu)

   అర్థము

    (విశేష్యము) : తోక; వెనుక పక్క

  Meaning

   (noun) : tail; hinder part

    వాడుక / Usage

    అష్టమినాడు ప్రొద్దు క్రుంకినంతనే వెన్నెలలు సితమత్స్యపుచ్ఛ రోచులు వెలిగ్రక్కెను.
    On the eighth day of the waxing fortnight as the Sun set, moon light shone like the tail of white fish.

  మెదడుకు మేత / Food for thought

    చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ
    చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ
    వున్నదంతా చీకటైతే వుంది నీవేలే
    వున్నదంతా చీకటైతే వుంది నీవేలే మిగిలింది నీవేలే
    చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
    చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
    చేరదిసి సేవచేసే తీరూ కరువాయే
    చేరదిసి సేవచేసే తీరూ
    కరువాయే నీ దారె వేరాయె ||చెలిమి||

    మరపురాని బాధకన్నా మధురమే లేదూ
    మరపురాని బాధకన్నా మధురమే లేదూ
    గతము తలచి వగచేకన్న సౌక్యమే లేదూ
    గతము తలచి వగచేకన్న సౌక్యమే లేదూ
    అందరాని పొందుకన్నా అందమేలేదు
    ఆనందమే లెడూ ||చెలియ||

    వరదపాలౌ చెరువులైన పొరలి పారేనే
    వరదపాలౌ చెరువులైన పొరలి పారేనే
    రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
    రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
    దారిలేని బాధతో నేనారిపోయేనా
    కధ తీరిపోయేనా ||చెలిమి||

    -- దేవదాసు(1953), సముద్రాల రాఘవాచార్య

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ