పైడికంటి
ఏప్రిల్ 29, 2025
పైడికంటి (paidi-kanti)
అర్థము
(విశేష్యము) : బంగారు రంగు కన్నుల పక్షి/గూబ; దీని కూత శుభ సూచకం
Meaning
(noun) : golden eyed; spotted owlet
వాడుక / Usage
ఆలయమునకు ప్రాగ్దిశయందున్న అశ్వత్థవృక్షాగ్రమున రెండు పైడికంటులు కిలకిల కూసెను.
Two spotted owlets called from the Aswattha tree to the east of the temple.
మెదడుకు మేత / Food for thought
ఓ ..... ఓ ప్రియతమా
పోదువో ఓ ప్రియతమా
పయనమయే ప్రియతమా నను మరచిపోకుమా
కరగునులే తారకలు మోముదాచె రేరాజు
పయనమయే ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా
విధి బలీయమని తెలుసు తెలుసు నాకు నీ మనసు
తనువులు వేరైనా మన మనసొకటేనే ఓ ప్రియతమా
పయనమయే ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా
దూర దేశమేగెదవో పెండ్లికూతురా
కనుల నీరు నింపకుమా సుఖపడుమా నీవైనా ప్రియతమా
పయనమయే ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా
ఓ ప్రియతమా
-- లైలా మజ్ను (1949), సముద్రాల రాఘవాచార్య
Comments
Post a Comment