ఉప్పతిల్లు

 

మే 01, 2025

ఉప్పతిల్లు (uppatilu)

   అర్థము

    (క్రియ) : పుట్టు; కలుగు; సంభవించు

  Meaning

   (verb) : to be born/produced/made

    వాడుక / Usage

    ఆ వేదవాక్కు తన్మహానిభృత ప్రచలన్మధురధ్వానమున ఉప్పతిల్లి ఉద్గీథము వలె ఉన్నది.
    That Vedic chant, self emanating and sonorous, was like the Samaveda .

  మెదడుకు మేత / Food for thought

    పలుకరాదటే చిలుకా పలుకరాదటే
    సముఖములో రాయబారమెందులకే

   ఎరుగని వారమటే? మొగమెరుగని వారమటే!
   పలికిన నేరమటే? పలుకాడగ నేరవటే
   ఇరుగు పొరుగు వారలకీ అరమరికలు తగునటనే

   మనసున తొణికే మమకారాలు
   కనులను మెరిసే నయగారాలు
   తెలుపరాదటే సూటిగా, తెరలు తీసి పరిపాటిగా

   -- షావుకారు (1950), సముద్రాల రాఘవాచార్య

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ