శోకతప్తము

 

ఏప్రిల్ 06, 2025

శోకతప్తము (soka-tapthamu)

   అర్థము

    (విశేషణము) : దుఃఖంతో నిండినబాధతో తపించిపోవడం; తీవ్రమైన వేదనలో ఉండడం

  Meaning

   (adj) : sorrowful; agitated by grief

    వాడుక / Usage

    అగమ్య గోచరమైన జీవనంలో, మసకబారిన కనులతో శోకతప్త భాష్పాలు కారని మనిషి ఎవడైనా ఉన్నాడా?
    Life bereft of direction, warm tears of agony welling from eyes; is there anyone not like this?

  మెదడుకు మేత / Food for thought

    నిదుర లేనిది ఈ రేయి, నిదుర లేనిది ఈ రేయి
    మరుల రాణి, మల్లెల బాణి, రెప్ప వేయకోయి
    చలువ వెన్నెలలూరే నీ గదిలో
    వలపుల మిణుగురుల
    తారకలు చూడుమా
    ఆశల శ్వాసల చుక్కలు
    వినువీధిన కనుమా.

    అవును నా నిజం నాకే అంతర్గతం
    తెలియదెవ్వరికీ నా నామధేయం
    ఎవ్వరికీ..అసలెవ్వరికీ...
    రవి కిరణం భువి తాకిన క్షణాన
    నీ అధరాల పై లిఖిస్తాను నా పేరు.

    నువ్వు నేనయ్యిన ఆ నిశ్శబ్ధం
    కరిగిపోయేను ఆ చుంబనంలో.

    ఓ చీకటి! ఓ మాపు! మాయమైపో
    ఆకాశాన మెరిసే తారలారా, తరలిపోండి మరలిపోండి!
    తొలి సంధ్య వేళలో, గెలుపు నాదే!
    గెలుపు నాదే!
    గెలుపు నాదే!

    -- నెస్సున్ డోర్మా, గియాకోమో పుచ్చినీ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ