దుర్వినియోగం

 

మే 19, 2025

దుర్వినియోగం (durviniyogam)

   అర్థము

    (విశేష్యము) : అక్రమమైన పద్ధతిలో (పదవి/ధనము) వాడడం

  Meaning

   (noun) : abuse/misuse (of power/funds)

    వాడుక / Usage

    శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దుర్వినియోగం - కేరళ సీఎం వివరణ.
    Sabarimala gold misappropriation - Kerala CM clarifies. 

  మెదడుకు మేత / Food for thought

ఎవ్వరూ... ఎవ్వరూ...
ఎవ్వరూ... ఎవ్వరూ... ఈ నేరాలడిగేవారెవ్వరూ...
ఈ పాపం కడిగే దిక్కెవ్వరూ...
ఎవ్వరూ... వారెవ్వరూ...

అందెలు సందడి చేసిన జాతరలో
ఆకలేసి ఏడ్చిన పసికందులు
అందం అంగడికెక్కిన సందులలో
అంగలార్చి ఆడిన రాబందులు
ఎందుకో... ఈ చిందులు...
ఎవరికో... ఈ విందులు...
ఏమిటో... ఏమిటో... ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో
ఏ కర్మం ఈ గాయం చేసిందో
ఏమిటో... ఆ ధర్మం ఏమిటో...

శీలాలకి సిలువలు...
కామానికి కొలువులు...
కన్నీటి కలువలు... ఈ చెలువలు...
కదులుతున్న ఈ శవాలు... రగులుతున్న స్మశానాలు...
మతెక్కన... మతితప్పిన... నరజాతికి వందనాలు...
ఎప్పుడో... ఎప్పుడో... ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో...
ఈ గాధలు ముగిసేది ఇంకెన్నడో...
ఎన్నడో... మోక్షం ఇంకెప్పుడో...

అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో
నేలపడిన మల్లెలు ఈ నవ్వులు
కుక్కలు చింపిన విస్తరి తీరులలో
ముక్కలైన బ్రతుకులు ఈ పూవులు
ఎందరికో... ఈ కౌగిళ్ళు...
ఎన్నాళ్ళో... ఈ కన్నీళ్ళు...
ఎక్కడో... ఎక్కడో... ఏ వేదం ఇది ఘోరం అన్నదో...
ఏ వాదం ఇది నేరం అన్నదో...
ఎక్కడో... ఆ వేదం ఎక్కడో...
ఎప్పుడో... ఎప్పుడో...

ఈ మల్లెల దుకాణాలు...
ఈ గానా భజానాలు...
వెదజల్లిన కాగితాలు... వెలకట్టిన జీవితాలు...
వల్లకాటి వసంతాలు... చస్తున్నా స్వాగతాలు...
ఎక్కి పడిన దాహాలకు తూట్లుపడిన దేహాలు...
ఎక్కడో... ఎక్కడో... ఈ రాధల బృందావనమెక్కడో...
ఈ బాధకు వేణుగానమెన్నడో...
ఎన్నడో...
ఎక్కడో... ఎప్పుడో...

-- మల్లెపూవు (1978), వేటూరి 

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం