పెను

 

మే 21, 2025

పెను (penu)

   అర్థము

    (విశేషణము) : పెద్ద; గొప్ప 

  Meaning

   (adj) : great; large; heavy

    వాడుక / Usage

    ఉత్తర్‌ప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన పెను గాలిదుమారం.
    Massive dust storm causes chaos in Uttar Pradesh.

  మెదడుకు మేత / Food for thought

    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది
    ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
    అదిరిపడి మేల్కొంది... అదేపనిగ కూసింది

    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది

    వెలుగు దుస్తులేసుకొని సూరీడు
    తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
    పాడు చీకటికి ఎంత భయమేసిందో
    పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
    అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
    ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి

    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది

    పాలవెల్లిలాంటి మనుషులు
    పండు వెన్నెల వంటి మనసులు
    మల్లెపూల రాశివంటి మమతలు
    పల్లెసీమలో కోకొల్లలు
    అనురాగం... అభిమానం..
    అనురాగం... అభిమానం.. కవలపిల్లలు
    ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్నతల్లులు

    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది

    -- ముత్యాల పల్లకి (1976), మల్లెమాల 

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం