భూఫలకం
మే 28, 2025
భూఫలకం (bhuphalakam)
అర్థము
(విశేష్యము) : భూమి పైపొరలో విడి విడిగా ఉన్న దృఢమైన భారీ పలకలు
Meaning
(noun) : tectonic plate
వాడుక / Usage
భూమిపై మొత్తం 17 ప్రధాన భూఫలకాలు ఉన్నాయి. వీటిలో 7 పెద్దవి కాగా, 10 చిన్నవి.
Earth is made up of 17 main tectonic plates of which 7 are big and 10 smaller.
మెదడుకు మేత / Food for thought
బ్రహ్మాండచ్ఛత్రదండః శతధృతిభవనాంభోరుహో నాలదండః
క్షోణీనౌకూపదండః క్షరదమరసరిత్పట్టికాకేతుదండః ।
జ్యోతిశ్చక్రాక్షదండస్త్రిభువనవిజయస్తంభదండో అంఘ్రిదండః
శ్రేయస్త్రైవిక్రమస్తే వితరతు విబుధద్వేషిణాం కాలదండః ॥
(బ్రహ్మాండమనే గొడుగుకు కాడలాగా, బ్రహ్మదేవుని నివాసమైన పద్మానికి తామరకాడలాగా, భూమి అనే ఓడకు తెరచాప స్తంభంలాగా, ప్రవహించే ఆకాశగంగ అనే జెండాకు ధ్వజస్తంభంలాగా, నక్షత్రమండలానికి ఇరుసులాగా మరియు ముల్లోకాలను జయించినందుకు గుర్తుగా నిలిపిన విజయస్తంభంలాగా ప్రకాశిస్తూ... దేవతల శత్రువులైన రాక్షసుల పాలిట యమదండం లాంటిదైన ఆ త్రివిక్రమ స్వామి పాదము మీకు సకల మంగళాలను, శ్రేయస్సును చేకూర్చుగాక!)
-- దశకుమార చరితం, దండి
Comments
Post a Comment