భూభ్రంశం

 

మే 29, 2025

భూభ్రంశం (bhubhramsam)

   అర్థము

    (విశేష్యము) : భూమి ఉపరితలంపై లేదా అంతర్భాగంలో ఉన్న శిలలు, ఫలకల కదలికల వల్ల పగుళ్లు ఏర్పడి వాటి అసలు స్థానం నుండి పక్కకు జరిగడం

  Meaning

   (noun) : fault

    వాడుక / Usage

    భూభ్రంశాల వెంబడి శిలలు ఆకస్మికంగా కదలడం వల్ల విపరీతమైన శక్తి విడుదలయ్యి భూకంపాలు సంభవిస్తాయి.
    When tectonic plates move along the faults suddenly, an enormous amount of energy is released causing earthquakes.

  మెదడుకు మేత / Food for thought

   అపశంకమంకపరివర్తనోచితాశ్చలితాః పురః పతిముపైతుమాత్మజాః।
   అనురోదితీవ కరుణేన పత్రిణాం విరుతేన వత్సలతయైవ నిమ్నగాః॥

   (పర్వతరాజు కుమార్తెలైన నదులు, తమ తండ్రి ఒడిలో స్వేచ్ఛగా ఆడుకుంటూ పెరిగాయి. ఇప్పుడు అవి ఎటువంటి శంకా లేకుండా, తమ భర్త అయిన సముద్రుడిని చేరుకోవడానికి ముందుకు ప్రవహిస్తున్నాయి. అలా పుట్టినిల్లు (పర్వతం) వదిలి అత్తవారింటికి (సముద్రం) వెళ్తున్నప్పుడు, ఆ నదీతీరాల్లోని పక్షులు చేసే కరుణ ధ్వనులు ఎలా ఉన్నాయంటే... ఆ నదులు తమ తండ్రిపై గల అమితమైన ప్రేమతో, దుఃఖాన్ని భరించలేక పక్షుల కూతల రూపంలో ఏడుస్తున్నాయా అన్నట్లుగా ఉంది)

  -- శిశుపాల వధ, మాఘ

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం