క్షీణము
జూన్ 01, 2025
క్షీణము (kshīṇamu)
అర్థము
(విశేషణము) : తగ్గుదల; కృశించినది; అల్పమైనది; క్షయించినది
Meaning
(adj) : decayed; decline; emaciated; wasted
వాడుక / Usage
ఎండలకు పశుగ్రాసం కరువై పశువుల క్షీరం క్షీణం.
Fodder in short supply due to heatwave - milk production declines.
మెదడుకు మేత / Food for thought
ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ
లఘ్వీ పురా వృద్ధిమతీ చ పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా
ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానామ్
(చెడ్డవారి స్నేహం ఉదయపు నీడ లాంటిది - మొదట ఎక్కువ, తర్వాత తక్కువ. మంచివారి స్నేహం సాయంత్రపు నీడ లాంటిది - మొదట తక్కువ, తర్వాత ఎక్కువ)
-- భర్తృహరి సుభాషితం
Comments
Post a Comment