క్షామము
జూన్ 02, 2025
క్షామము (kshāmamu)
అర్థము
(విశేష్యము) : కరువు; దుర్భిక్షం; కృశము; సన్నము
Meaning
(noun) : famine; scarcity; emaciated
వాడుక / Usage
ఒడిశా క్షామం: పది లక్షలకు పైగా భారతీయులు చనిపోతుంటే బ్రిటిషర్లు చూస్తూ ఊరుకున్నారు.
Odissa famine: a million Indians perished due to British inaction.
మెదడుకు మేత / Food for thought
కిం శీకరైః క్లమవిమర్ద్దిభిరార్ద్రవాతం సంచాలయామి నలినీదలతాలవృంతమ్ |
అంకే నిధాయ చరణావుత పద్మతామ్రౌ సంవాహయామి కరభోరు యథాసుఖం తే ||
(ఓ సుందరీ! విరహ తాపంతో అలిసిపోయిన నిన్ను చూస్తుంటే నా హృదయం ద్రవిస్తోంది. నీ అలసటను పోగొట్టడం కోసం, చల్లని నీటి చినుకుల వంటి తడి గాలి తగిలేలా... ఈ తామర ఆకు విసనకర్రతో నీకు విసరనా? లేదా, ఎర్రతామర పూలలా ఎంతో సుకుమారంగా ఉన్న నీ పాదాలను నా ఒడిలో ఉంచుకుని, నీకు ఉపశమనం కలిగేలా మెల్లగా నొక్కనా)
-- అభిజ్ఞాన శాకుంతలం, మహాకవి కాళిదాసు
Comments
Post a Comment