క్షమ
జూన్ 05, 2025
క్షమ (kshama)
అర్థము
(విశేష్యము) : ఓర్పు; సహనము; మన్నించుట; భూమి/నేల
Meaning
(noun) : patience; forgiveness; The Earth
వాడుక / Usage
జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా జీవితం సార్థకం అవుతుంది.
Truthfulness, kindness and forbearance lead to a fulfilling and meaningful life.
మెదడుకు మేత / Food for thought
మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనామ్ |
మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్ ||
(దుర్మార్గులు మనసులో ఒకటి ఆలోచిస్తారు, పైకి ఒక మాట చెప్తారు, కానీ చేసేటప్పుడు పూర్తిగా వేరొక పని చేస్తారు. కానీ సజ్జనులు మాత్రం మనసులో ఏది అనుకుంటారో దాన్నే మాట్లాడతారు; ఏది మాట్లాడతారో దాన్నే చేసి చూపిస్తారు. భారతీయ తత్వశాస్త్రంలో దీనినే "త్రికరణ శుద్ధి" అంటారు. మనసు (ఆలోచన), వాక్కు (మాట), కర్మ (పని). ఈ మూడూ ఒకే సరళరేఖలో, పారదర్శకంగా ఉండటమే ఉత్తమ మానవ లక్షణం)
-- సుభాషితం
Comments
Post a Comment