సొమ్మసిల్లు
జూన్ 25, 2025
సొమ్మసిల్లు (somma-sillu)
అర్థము
(క్రియ) : మూర్ఛపోవు; ఎక్కువగా అలసిపోవు
Meaning
(verb) : to faint/swoon; extremely tired
వాడుక / Usage
మూగజీవాలకు వడదెబ్బ.. ఎండలకు సొమ్మసిల్లుతున్న పశువులు.
Animals suffer heat stroke..cattle drop due to heat exhaustion.
మెదడుకు మేత / Food for thought
మనసు స్వాధీనమైన యా ఘనునికిమఱి మంత్రతంత్రము లేల
తనువు తానుగాదని యెంచువానికి
తపసు చేయనేల దశరథబాల
అన్ని నీవనుచు యెంచినవానికి
యాశ్రమ భేదములేల
కన్నుగట్టు మాయలని యెంచువానికి
కాంతల భ్రమలేల దశరథబాల
ఆజన్మము దుర్విషయ రహితునికి గ
తాగత మికనేల
రాజరాజేశ నిరంజన నిరుపమ
రాజవదన త్యాగరాజ వినుత
-- త్యాగరాజ స్వామి
Comments
Post a Comment