కూపము
జులై 20, 2025
కూపము (kūpamu)
అర్థము
(విశేష్యము) : నుయ్యి; గుంట; బావి
Meaning
(noun) : a pit/well/hole
వాడుక / Usage
కాలుష్య కోరల్లో జీవనది - మురికి కూపంలా మారిన గోదావరి!
Life giving river in the grip of pollution - Godavari turns into a cesspit.
మెదడుకు మేత / Food for thought
జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలని, దానిలోని అసలు సిసలైన నిజాలను తెలుసుకోవాలని, మరియు జీవితం నేర్పే పాఠాలను నేర్చుకోవాలని నేను అడవికి వెళ్ళాను. నా చివరి రోజుల్లో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, నేను అసలు బ్రతకనే లేదు అనే నిరాశ కలగకూడదనే అలా చేశాను.-- వాల్డెన్, హెన్రీ డేవిడ్ థోరో
Comments
Post a Comment