జులై 24, 2025
నియంతృత్వము (niyantrutvam)
అర్థము
(విశేష్యము) : అన్ని అధికారములు ఒకరి చేతిలోనే ఉండటం; ప్రతిబంధకాలు లేని అధికారం
Meaning
(noun) : dictatorship
వాడుక / Usage
నియంతృత్వానికి యువత అడ్డుకట్ట!
Youth are the bulwark against dictatorship!
మెదడుకు మేత / Food for thought
నియంత ఏలే రాజ్యంలో స్వేచ్ఛకు చోటుండదు; అక్కడ ఎన్నికలనేవి కంటితుడుపు నాటకాలు! పహారా కాసే పోలీసులే తుపాకీ పట్టిన సైన్యమై నిలబడతారు. 'నోరెత్తితే ప్రాణాలకే ముప్పు' అనే భయమే ప్రజల కాళ్ళకు సంకెళ్ళు వేస్తుంది. ప్రజల నోటికాడి కూడు దోపిడీకి గురవుతుంటే, పాలితులంతా కట్టుబానిసలై నిశ్శబ్దంగా నలిగిపోతారు.
Comments
Post a Comment