తత్తరపాటు
ఆగష్టు 04, 2026
తత్తరపాటు (tattara-pāṭu)
అర్థము
(విశేష్యము) : కలవర పడటం; సంభ్రమం
Meaning
(noun) : perplexity; agitation; confusion
వాడుక / Usage
ఆయన అర్ధరాత్రి వీడియో పెట్టడం తత్తరపాటుకు సంకేతం.
Releasing a video in the middle of night is a sign of anxiety.
మెదడుకు మేత / Food for thought
మనం చూస్తాం ఆ రోజు కూడా మనం తప్పక చూస్తాం
మనం చూస్తాం
యే రోజు కోసం కలలు కన్నామో శపథాలు చేశామో
చరిత్ర యొక్క చెరగని ఫలకాలపై ఏదైతే రాసుందో
మనం చూస్తాం
నిరంకుశత్వ రాతి గుండెల ఉక్కు పాదాలు
దూది పింజాలుగా కొట్టుకు పోతాయో
అణగారిన మన పాదాల క్రింద
భూమి నలుదిక్కులా మారుమ్రోగి
కర్కశ నాయకుల శిరస్సులపై
ఫెళఫెళ మెరుపులు ప్రజ్వలించే రోజు
మనం చూస్తాం
-- హమ్ దేఖేంగే, ఫైజ్ అహ్మద్ ఫైజ్
Comments
Post a Comment