నగిషీ

 

ఆగష్టు 10, 2026

నగిషీ (nagishi)

   అర్థము

    (విశేష్యము) : లోహాలు, రాయి, చెక్క లేదా ఆభరణాలపై పనిముట్లతో అందంగా చెక్కడం

  Meaning

   (noun) : filigree; engraving

    వాడుక / Usage

    ‘పట్టా’లెక్కిన పనులు.. నగరానికి ‘నగిషీ’లు.
   Works Gain Momentum... City undergoes Beautification.

  మెదడుకు మేత / Food for thought

    అయితే మనకు కొంచం భావుకత్వం ఉండాలి. అంటే దాబా మీద పడుకుని చందమామలోకి చూసి ఆ మచ్చకు అర్థం వెతుకుతూ, అందులో ఉండే ముసలామె ముఖాన్ని ఊహించుకుంటూ, ఆమె కనుక దోసెలు పోస్తూ ఉంటే ఆ చుర్రుమనే శబ్దాన్ని వింటూ, రాత్రి శ్వాస సోకితే చాలు ఆయువు వొదిలేసి రాలిపోయే పూల మృత్యుసౌందర్యాన్ని పరికిస్తూ, పాతకాలపు కిటికీ మీద ఒక నగిషీ, చిన్నపిల్లల చేతుల్లో గోరింటాకుతో పెట్టిన నెలవంక, నిట్టనిలువుగా తాకుతున్న ఎండకు తల వొంచకుండా మెరుస్తున్న తాటిముంజ తడి, వయసొచ్చిన ఆడపిల్ల పాదాల మెత్తటి ధ్వని...ఇవన్నీ చూసి మురిసిపోయే లక్షణం ఉండాలి.

    -- కథలు ఇలా కూడా రాస్తారు, మొహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం