ఠికానా

 

ఆగష్టు 13, 2026

ఠికానా (tikaana)

   అర్థము

    (విశేష్యం) : ఆశ్రయము; గతి; నివాసము; దిక్కు; జాడ

  Meaning

   (noun) : residence; abode; shelter; prospect; means

    వాడుక / Usage

    రామగిరి ఠాణా.. అక్రమాలకు ఠికానా.
   Ramagiri police station.. den of illegal activities.

  మెదడుకు మేత / Food for thought

    కథలు దేంతో రాస్తారు? జ్ఞాపకశక్తితో. జ్ఞాపకశక్తి ఉన్నవాళ్లు రాస్తారు. అది బొత్తిగా లేనివాళ్లు మాత్రమే రాస్తారు. ఇంట్లో - సాయంత్రం వస్తూ వస్తూ కూరగాయలు పట్రండి అంటే మర్చిపోవాలి. రాత్రి ఫలానా చోట పార్టీ అంటే మర్చిపోవాలి. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టే ఆఖరి తేదీ మర్చిపోవాలి. ఇలాంటివి మర్చిపోయేవాళ్ళకి వేరేవి గుర్తుంటాయి. సెలెక్టెడ్ మెమరీ. కథలకు మాత్రమే పనికొచ్చే మెమరీ - ఇదో క్లాసులో మూడు గజాల ముతకగుడ్డ కొని, శెట్టిగారి షాపు బయటే ఉన్న టైలర్ సాహెబుకిచ్చి, ముప్పావలా పెట్టి కుట్టించిన స్కూలుసంచి ముక్కుపొడుం రంగు గుర్తుంటుంది.

    -- కథలు ఇలా కూడా రాస్తారు, మొహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం