స్పందన

 

ఆగష్టు 14, 2026

స్పందన (spandana)

   అర్థము

    (విశేష్యం) : కదలిక; స్పృహ; ఒక వస్తువు చలించి మరల విశ్రాంతికి రావడం

  Meaning

   (noun) : throbbing; vibrating; quivering; reaction

    వాడుక / Usage

    ఉచిత డయాబెటిక్ శిబిరమునకు విశేష స్పందన.
   Free diabetes camp sees enormous response.

  మెదడుకు మేత / Food for thought

    ఇప్పుడు ఒక పాత సైకిల్ వర్ణించాలి...ఇమేజెస్ పడిపోవాలి...దానికి బెల్లు లేదు. నిజానికి ఉందిగానీ దాని క్యాప్ లేకపోవడంవల్ల నొక్కినప్పుడు తుస్కు తుస్కు మని బలహీనంగా చప్పుడు చేస్తోంది. కొన్ని స్పోకులు పోయాయి. ఒకటి ఊడి ముందు చక్రంతో పాటు వదులుగా తిరుగుతూ గాల్లో వేళ్లాడుతోంది....ఎప్పుడూ గోడకు వాల్చిపెట్టాలి. సీటు సంగతి సరేసరి. ఎండిన తోలు ముక్క. ఇవన్నీ కథలో వాడం. ఒకటి రెండు వేస్తాం. ఇదే టక్కున తగిలి పాఠకుణ్ణి తాను చూసిన ఎదో ఒక సైకిల్ దగ్గరకి తీసుకువెళుతుంది.

    -- కథలు ఇలా కూడా రాస్తారు, మొహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం