బిత్తరము
ఆగష్టు 07, 2026
బిత్తరము (bittaramu)
అర్థము
(విశేష్యము) : శృంగార చేష్ట; సరసము; తళుకు; అదురుపాటు
Meaning
(noun) : amorous gesture; brightness; tremble; shake
వాడుక / Usage
మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనపడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి.
The trembling eyes of the damsel in the flash of lightning warms the cockles of one's heart.
మెదడుకు మేత / Food for thought
చివరకు ఆ పరమాత్మ నామం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుంది!
ఆయనే అదృశ్యంగా ఉన్నాడు, ఇక్కడే ప్రత్యక్షంగానూ ఉన్నాడు...
కనిపించే దృశ్యమూ ఆయనే, దాన్ని చూసే ద్రష్ట కూడా ఆయనే!
"నేనే సత్యాన్ని!" అహం బ్రహ్మాస్మి అనే విప్లవ నినాదం మార్మోగుతుంది!
ఆ సత్యం నాలోనూ ఉంది, నీలోనూ ఉంది!
ఇకపై ఈ భగవంతుని సృష్టి అయిన సామాన్య ప్రజలే పరిపాలిస్తారు!
ఆ ప్రజలమంటే మరెవరో కాదు... నేను, నువ్వు, మనమందరమే!
మనం చూస్తాం!
ఖచ్చితంగా ఆ రోజును మనం చూసి తీరుతాం!
మనం తప్పక చూస్తాం!
-- హమ్ దేఖేంగే, ఫైజ్ అహ్మద్ ఫైజ్
Comments
Post a Comment