దామోదరుడు
సెప్టెంబర్ 10, 2026
దామోదరుడు (dām-ōdaruḍu)
అర్థము
(విశేష్యము) : త్రాడు (దామము) తో పొట్ట (ఉదరము) చుట్టూ కట్టబడ్డవాడు; కృష్ణుడు
Meaning
(noun) : one who was tied around stomach with a rope; Krishna
వాడుక / Usage
తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన.
You pervade me Krishna, my life is you O Krishna!
మెదడుకు మేత / Food for thought
కళ్లు వాకిట నిలిపిచూచే
పల్లెటూళ్లో తల్లి ఏమని
పలవరిస్తోందో...?
చింతనిప్పులలాగు కన్నుల
చెరిగిపోసే మంటలెత్తగ,
గుండుసూదులు గ్రుచ్చినట్లే
శిరోవేదన అతిశయించగ,
రాత్రి, నల్లని రాతి పోలిక
గుండె మీదనె కూరుచుండగ,
తల్లిపిల్చే కల్లదృశ్యం
కళ్లముందట గంతులేయగ
చెవులు సోకని పిలుపులేవో
తలచుకుంటూ, కలతకంటూ-
తల్లడిల్లే,
కెళ్లగిల్లే
పల్లటిల్లే బాటసారికి
ఎంత కష్టం!
పల్లెటూళ్లో తల్లి ఏమని
పలవరిస్తోందో...?
చింతనిప్పులలాగు కన్నుల
చెరిగిపోసే మంటలెత్తగ,
గుండుసూదులు గ్రుచ్చినట్లే
శిరోవేదన అతిశయించగ,
రాత్రి, నల్లని రాతి పోలిక
గుండె మీదనె కూరుచుండగ,
తల్లిపిల్చే కల్లదృశ్యం
కళ్లముందట గంతులేయగ
చెవులు సోకని పిలుపులేవో
తలచుకుంటూ, కలతకంటూ-
తల్లడిల్లే,
కెళ్లగిల్లే
పల్లటిల్లే బాటసారికి
ఎంత కష్టం!
-- బాటసారి, మహాప్రస్థానం, శ్రీశ్రీ
Comments
Post a Comment