త్రివిక్రముడు
సెప్టెంబర్ 11, 2026
త్రివిక్రముడు (tri-vikramuḍu)
అర్థము
(విశేష్యము) : మూడు లోకములను మూడడుగులుగా కొలచిన వాడు; వామనుడు; విష్ణువు
Meaning
(noun) : one who encompasses the three worlds with three steps; Vamana; Vishnu
వాడుక / Usage
వెన్నెలలో నవ్వకు త్రివిక్రమా, కన్న విన్నవారేమందురో త్రివిక్రమా, విన్నాణపుచేఁతల త్రివిక్రమా, వెన్నగారీ నీ మోవి త్రివిక్రమా.
O Trivikrama, who performs leelas! Do not smile like that in this cool moonlight! those who see or hear it will wonder with many doubts, O Lord with lips as soft as butter!
మెదడుకు మేత / Food for thought
అతని బ్రతుకున కదే ఆఖరు!
గ్రుడ్డి చీకటిలోను గూబలు
ఘాకరించాయి;
వానవెలసీ మబ్బులో ఒక
మెరుపు మెరిసింది;
వేగుజామును తెలియజేస్తూ
కోడి కూసింది;
విడిన మబ్బుల నడుమనుండీ
వేగుజుక్కా వెక్కిరించింది;
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది!
పల్లెటూళ్లో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది!
గ్రుడ్డి చీకటిలోను గూబలు
ఘాకరించాయి;
వానవెలసీ మబ్బులో ఒక
మెరుపు మెరిసింది;
వేగుజామును తెలియజేస్తూ
కోడి కూసింది;
విడిన మబ్బుల నడుమనుండీ
వేగుజుక్కా వెక్కిరించింది;
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది!
పల్లెటూళ్లో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది!
-- బాటసారి, మహాప్రస్థానం, శ్రీశ్రీ
Comments
Post a Comment