కిన్నెర

 

సెప్టెంబర్ 14, 2026

కిన్నెర (kinnera)

   అర్థము

    (విశేష్యము) : సగం గుర్రము లేక హంస లాగా, మిగతా మనిషిలాగా ఉండే దేవ కన్యలు; సంగీత నృత్యాలకు ప్రతీక; ఒక రకమైన వీణ

  Meaning

   (noun) :  divine nymphets half horse or swan and half human; symbol of music and dance; a kind of Veena

    వాడుక / Usage

    కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ.
   Here comes the divine beauty adorned with the radiance of a full moon night.

  మెదడుకు మేత / Food for thought

    నెలవంక తలపాగ నెమలి యీకగ మారె,
    తలపైని గంగమ్మ తలపులోనికి బారె,
    నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
    బూదిపూతకు మారు పులితోలు వలువాయె
    ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా
    తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
    ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
    కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు
    -- భక్త కన్నప్ప, వేటూరి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం