ఒడంబడిక
సెప్టెంబర్ 22, 2026
ఒడంబడిక (oḍam-baḍika)
అర్థము
(విశేష్యము) : ఒప్పందం; అంగీకారం; సమ్మతి
Meaning
(noun) : pact; treaty; agreement
వాడుక / Usage
సింధూ జలాల ఒడంబడిక నిలిపివేత.
Indus water treaty suspended.
మెదడుకు మేత / Food for thought
గత 15 ఏళ్లుగా నేను తీవ్రంగా ఈ లౌకిక జీవితం గూర్చి అధ్యయనం చేశాను. నేను గత 15 ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని, మానవులను చూడలేదనేది వాస్తవమే గానీ, మీ పుస్తకాలలో నేను అద్భుతమైన మధువును గ్రోలాను, పాటలు పాడాను, వేటాడాను, స్త్రీలను ప్రేమించాను. మీ కవులు, రచయితలు సృష్టించిన అప్సరసలందరూ రాత్రిళ్లు నా వద్దకు వచ్చి నా మతి పోగొట్టే కథలను నాకు చెప్పేవారు. మీ పుస్తకాలలో నేను ఎత్తైన శిఖరాలను అధిరోహించాను, సూర్యోదయాలను, సూర్యాస్తమయాలను చూశాను. అగాధాల్లోకి దూకాను, అద్భుతాలు చేశాను, హత్యలు చేశాను, ఊళ్ళు తగలబెట్టాను, కొత్త మతాలు సృష్టించాను, రాజ్యాలు జయించాను.
-- అంతన్ చెకోవ్ రాసిన "ది బెట్" కథ ముగింపులో, ఖైదీ బ్యాంకర్ కోసం రాసిన లేఖ
Comments
Post a Comment