చికిలించు

 

సెప్టెంబర్ 23, 2026

చికిలించు (chikilinṭsu)

   అర్థము

    (క్రియ) : కళ్ళు మూస్తూ తెరుస్తూ చూసే చూపు

  Meaning

   (verb) :  to blink/squint; look with half closed eyes

    వాడుక / Usage

    దిగ్భ్రమతో కళ్లు చికిలించి చూసాడు జాయపుడు.
   Jaayapa squinted anxiously.

  మెదడుకు మేత / Food for thought

    మీ పుస్తకాలు నాకు అంతులేని తెలివిని ప్రసాదించాయి. తరాలుగా మానవ మేధ చేసిన ఆలోచనలన్నీ నా చిన్ని మెదడులో నిక్షిప్తమైపోయాయి. మీ అందరికంటే నేను తెలివైన వాడినని నాకు తెలుసు. ఇక నేను మీ పుస్తకాలని, తెలివిని, ఈ ప్రపంచపు దీవెనలని తృణీకరిస్తున్నాను. అవి ఎందుకు కొరగానివి, ఎండమావుల వంటివి. మనల్ని మోసం చేస్తాయి, భ్రమ పెడతాయి. మీరు తెలివైన వాళ్ళు కావచ్చు, హోదాగా ఉండొచ్చు, అంతా బాగుందని అనుకోవచ్చు, కానీ మరణం అనేది మనని మరు నిమిషంలో ఈ భూమి మీద నుంచి నామరూపాలు లేకుండా తీసుకెళ్ళిపోతుంది.
    -- అంతన్ చెకోవ్ రాసిన "ది బెట్" కథ ముగింపులో, ఖైదీ బ్యాంకర్ కోసం రాసిన లేఖ

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం