పశ్చాత్తాపము

 

సెప్టెంబర్ 28, 2026

పశ్చాత్తాపము (paṣchāt-tāpamu)

   అర్థము

    (విశేష్యము) : జరిగిన దానికి/తరువాత చింతించడం; మొదట చేయరాని పనిచేసి తరువాత బాధపడటం

  Meaning

   (noun) :  remorse; repentance

    వాడుక / Usage

    ప్రసేన్ రాసిన ‘ఆమె లేని వీధి’ కథను మొదట చదివినప్పుడు, అది ఒక జర్నలిస్టుకు ఒక వేశ్య పట్ల ఏర్పడిన ఆకర్షణ, ఆమె అదృశ్యం, చివరకు ఆమె మరణం ద్వారా అతనిలో కలిగిన పశ్చాత్తాపం గురించి రాసిన కథగా అనిపించింది..
   When I first read Prasen's "The street without her" it felt like a story about a journalists attraction to a prostitute, her disappearance and his remorse following her death.

  మెదడుకు మేత / Food for thought

    కొంచెం లోతుగా చూస్తే కథ అసలు సమస్య ఆమె మరణం కాదు; ఆమె అతని కళ్ల ముందే ఉన్నప్పుడు ఆమెను మనిషిగా చూడకుండా, తన కోరికకు సంబంధించిన వస్తువుగా మాత్రమే చూడటం అని తోచింది. ఇదే కథకు బలం. కథలో మరో బలమైన అంశం ‘వాతావరణ నిర్మాణం’. చిన్న హోటళ్లు, వైన్‌షాపులు, పాన్‌ డబ్బాలు, పాడుబడ్డ భవనాలు, నిద్రలేని కుక్కలు, నిరాశగా తిరిగే మనుషులతో కూడిన కొత్త బజారు వాతావరణం ద్వారా సమాజపు ప్రధాన ప్రవాహానికి దూరంగా, వెలివేతకు గురై, ప్రాథమిక హక్కులకు కూడా నోచుకోని వేశ్యల జీవనస్థితిని రచయిత నిర్మించాడు.
-- బాలాజీ పోతుల, eemata

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం