పునాది
సెప్టెంబర్ 29, 2026
పునాది (punādi)
అర్థము
(విశేష్యము) : ఆధారము, మూలకారణము; బలం కోసం గోడకు అడుగున భూమిలో లోతుగా త్రవ్వి కట్టే గోడ
Meaning
(noun) : basis; foundation
వాడుక / Usage
కథ చివర్లో తాను చేసిన తప్పును గుర్తించడానికి ఈ దృష్టికోణమే పునాది అవుతుంది.
That perspective becomes the basis to realise the mistake he made.
మెదడుకు మేత / Food for thought
రాణి పాత్రలో రచయిత కొన్ని మంచి సంకేతాలనే పెట్టాడు. ఆమె చిలిపి మాటలు, జర్నలిస్టును ఆటపట్టించడం, పిల్లవాడికి బజ్జీలు కొనివ్వడం, ‘అక్కా’ అనే పిలుపుకు ఆమె ముఖం వెలిగిపోవడం, “ఎక్కడికైనా పారిపోవాలనిపించిందా?” అనే ప్రశ్న— ఇవన్నీ పైకి కనిపిస్తున్న ఆమె జీవితానికి అవతలి జీవితాన్ని చూపుతాయి. ముఖ్యంగా “మీరు నన్ను చూస్తారు. కానీ చూడనట్టు నటిస్తారు” అనే మాట కథకు కేంద్ర వాక్యంగా నిలుస్తుంది.
-- బాలాజీ పోతుల, eemata
Comments
Post a Comment