పుండరీకాక్షుడు
సెప్టెంబర్ 08, 2026
పుండరీకాక్షుడు (punḍarīk-ākshuḍu)
అర్థము
(విశేష్యము) : తెల్ల తామర (పుండరీకం) వంటి ప్రకాశము గల కళ్ళు కలవాడు; విష్ణువు
Meaning
(noun) : he whose eyes are bright as white lotus; Vishnu
వాడుక / Usage
తన భక్తులపట్ల గల పక్షపాతంతో పుండరీకాక్షుడు జగన్మోహిని అవతారం ఎత్తాడు.
Ever the bestower of love to his Bhaktas, Vishnu took the form of Mohini.
మెదడుకు మేత / Food for thought
ఆయన నాటకం చూస్తే పాషాణ హృదయమైనా కరగాల్సిందే! వీరావేశంతో స్వాతంత్య్రోద్యమంలో దూకాల్సిందే! అక్షరాన్నే ఆయుధంగా మలచుకొని.. తెల్లవారిపై నాటకాలతో సాయుధ పోరాటం చేసిన అరుదైన తెలుగు వీరుడు దామరాజు పుండరీకాక్షుడు! రచనలను నిషేధించినా ఆయన్ను కట్టడి చేయలేకపోయిన ఆంగ్లేయ సర్కారు చివరకు.. గాంధీ ఊసు లేకుండా నాటకం రాస్తే రూ.50 వేలిస్తామంటూ ఆశపెట్టినా తలొగ్గని దేశభక్తుడు.
-- https://www.etvbharat.com/telugu/telangana/bharat/azadi-ka-amrit-mahotsav-damaraju-pundarikakshudu-biography/na20220726063708976976609
Comments
Post a Comment